![]() |
![]() |

ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ వారం షో ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇందులో ఇండస్ట్రీ సీనియర్స్ గా హరిత, ఇంద్రనీల్, అనిల్, భావన, కళ్యాణ్ వచ్చారు. జూనియర్స్ గా శ్రీకర్, హమీద, పవిత్ర, కళ్యాణ్, ప్రేరణ వచ్చారు. ఇక శ్రీముఖి సీనియర్స్ ఎవరెవరు ఏ టైంలో ఇండస్ట్రీకి వచ్చారో వాళ్ళ గురించిన విషయాలు అడిగింది. హరిత 1992 లో ఇండస్ట్రీకి వచ్చినట్లు చెప్పింది. భావన 1986 లో తన నాలుగేళ్ల వయసులో వచ్చినట్లు చెప్పింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఉంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ దాటిపోయాను. మధ్యలో ఒక టు ఇయర్స్ గ్యాప్ తీసుకున్నా..ఫేస్ మెచ్యూరిటీ లేదని ఇండస్ట్రీకి దూరంగా ఉన్నట్లు చెప్పింది.
ఇక అనిల్ 2001 లో ఇండస్ట్రీకి వచ్చినట్లు చెప్పారు. ఇంద్రనీల్ ని ఆ రోజుల్లో టీవీలో చూసి ఏంటి ఇంత బాగున్నాడు అని అనుకునేది శ్రీముఖి..ఎంతోమంది లేడీ ఫాన్స్ ని చూసి ఉంటారు కదా మీరు అని అడిగేసరికి అప్పట్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాడు ఇంద్రనీల్. "ఆ రోజు సీరియల్ షూటింగ్ జరుగుతోంది.. అప్పుడు ఒక రోజు నేను మా డాడీని బైక్ మీద తీసుకెళ్తున్నాను. సిగ్నల్ దగ్గర హెల్మెట్ తీశాను. వెనకాల ఒక పది మంది కాలేజీ అమ్మాయిలు అంతా బైక్స్ మీద ఉన్నారు. ఇంద్ర అని గుర్తుపట్టి నన్ను ఆపడానికి ఒక కిలోమీటర్ ఫాలో అయ్యారు. నెక్స్ట్ మా డాడీ విజయవాడ తీసుకెళ్లి కార్ కొనిచ్చారు" అని చెప్పాడు. ఇక రాధా - మధు హీరో కళ్యాణ్ ఇండస్ట్రీ ఎంట్రీ వెరైటీగా జరిగిందట "ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ని కలవడానికి జస్ట్ ఎల్లో ఆఫీస్ కి వెళ్తే అక్కడ కొంతమంది నన్ను చూసి ప్రొడ్యూసర్ కి నన్ను చూపించి ఈ అబ్బాయి బాగున్నాడు హీరో గా చేస్తే బాగుంటుందని చెప్పారు" అలా ఇండస్ట్రీలోకి వచ్చాను అని చెప్పాడు. ఇలా సీనియర్స్ ఇండస్ట్రీకి ఎప్పుడొచ్చారో చెప్పారు.
![]() |
![]() |